ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా వస్తున్న జూనియర్ సినిమా ఈ నెల 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర కథానాయకుడు కిరీటి సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో బాగా బిజీగా ఉన్నాడు. కిరీటి మీద హై ఎక్సపెక్టేషన్స్ ముమ్మరంగా ఉన్నాయి. చాలా స్పీడుగా డాన్సులు, ఫైట్లు…అంటే ఓ పెరఫెక్టు కమర్షియల్ హీరోలా ప్రేక్షకుల ముందుకు రావడానికి కిరీటి సిద్ధమవుతున్నాడన్నది ఆర్ధమవుతోంది. అందుకే దాదాపుగా నాలుగైదేళ్ళ ప్రిపరేన్తో కిరీటి బాగా రాటుదేలి తెరంగేట్రం చేస్తున్నాడు. సినిమాలో కూడా కమర్షియల్ విలువలు ఏ మాత్రం తగ్గకుండా భారీ తారలే కిరీటి చుట్టూ నిలబడ్డారు. కన్నడంలో సూపర్స్టార్డమ్ అందుకున్న రవిచంద్ర ఓ ప్రధానపాత్రను పోషిస్తున్నాడు. ఇక్కడ యూత్ హాట్‌స్టార్ శ్రీలీల కిరీటికి జతగా చాలా గ్లామరస్‌గా కనబడింది సినిమా ట్రయిలర్లో.
ఇవన్నీ గాక మన తెలుగు రాక్‌స్టార్‌గా ఇండియాలోనే ఓ ప్రముఖ స్థానాన్ని సాధించిన రాక్ స్టార్ డిఎస్పీ జూనియర్ సినిమాకి అదిరిపోయే ట్యూన్లు సమకూర్చడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది,. కిరీటి జూనియర్ సినిమాతో యంగ్ హీరోలకి గట్టి కాంపిటేషనే ఇవ్వబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ, కన్నడ రెండు పరిశ్రమలలోనూ కిరీటికి జూనియర్ సినిమా చాలా స్ట్రాంగ్ మార్కెట్‌నే తీసుకురాబోతోందనేది అందరి అంచనా. పెద్ద హీరోలు ఎలాగూ ఎవ్వరికీ దొరకరు. మధ్య రేంజ్ హీరోలు కూడా ఎవరికివారు గిరి గీసుకుని ఎవ్వరినీ దగ్గరకు రానివ్వకుండా మెంటైన్ చేస్తున్నారనే పెద్ద క్రిటిజమ్ పరిశ్రమలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో జూనియర్ సినిమా గనక అందరూ అనుకుంటున్నట్టగా హిట్ అయిందా చాలా మంది మీడియం రేంజ్ హీరోలకి దెబ్బ పడిపోవడం ఖాయమనేది బిగ్గరగా వినిపిస్తోంది.
జూనియర్ సినిమా ఎంత కిరీటికి తొలి చిత్రమైనా సరే గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కదా…..ఏ మాత్రం బడ్జెట్లో లోపం జరగలేదు. ఒక న్యూ హీరోకి ఇంత బడ్జెట్ పెట్టడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుండగా, కిరీటి పెరఫారమెన్స్ గురించి కూడా అంత కన్నా గట్టిగానే అందరూ అభినందిస్తున్నారు. ఇన్నీ వర్కవుట్ అయి, జూనియర్ సినిమా విస్తృతంగా ప్రేక్షకాదరణ పొందితే మరో ప్రామిసింగ్ హీరో సౌత్ ఇండియాకి దొరికినట్టే. ఏ లాంగ్వేజ్ మీద కిరీటి ఎక్కువగా దృష్టి పెడతాడన్నది పెద్దగా డిస్కషన్‌కి రావడం లేదు. ఎందుకంటే ఇవ్వాళరేపు అన్నీ పాన్ ఇండియా సినిమాలే కాబట్టి ఆ గొడవ లేదు. కాకపోతే కిరీటి బేసిక్‌గా తెలుగువాడు కాబట్టి తెలుగుకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చూద్దాం. జూనియర్ కిరీటి ఎంతవరకూ విజయం సాధిస్తాడో….