ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. అమ్మడు ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తుందో తెలియదు కానీ.. చాలా సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అవుతోంది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
పెళ్లి సందడి తర్వాత రవితేజ ధమాకా సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). అదే జోష్‌లో వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఓకే చేసేసింది అమ్మడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా రొమాన్స్ చేస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తోంది. మొత్తంగా కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకుంది శ్రీలీల. అంతేకాదు.. శ్రీలీల చేస్తున్న సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. దసరాకు వచ్చిన బాలయ్య ‘భగతవంత్ కేసరి’తో హిట్ కొట్టింది.
ఇది తప్పితే.. వరుసగా రెండు సినిమాలతో ఫ్లాప్ అందుకుంది. రామ్‌తో చేసిన స్కంద, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమాలు హిట్ ఇవ్వలేకపోయాయి. అలాగే నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ కూడా హిట్ ఇవ్వలేదు. కానీ సంక్రాంతి కానుకగా జనవరి 12న మహేష్ బాబు సరసన నటించిన ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేను పక్కకు తప్పించి మరీ శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశాడు త్రివిక్రమ్. ప్రస్తుతానికి ఈ సినిమా పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. అయితే.. ఇప్పుడు శ్రీలీల ఎగ్జామ్స్ రాయడానికి షూటింగ్‌కు బ్రేక్(break) ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది. దీంతో ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగా ఒక వారం రోజుల పాటు శ్రీలీల షూటింగ్స్‌కి అందుబాటులో ఉండదట. ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్లీ సెట్స్‌లో జాయిన్ అవ్వనుంది శ్రీలీల. ఏదేమైనా స్టార్ హీరోయిన్గా రాణిస్తునే స్టడీ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది అమ్మడు.