»Amarnath Yatra Temporary Break For Amarnath Yatra
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్
భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు. అయితే ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Amarnath Yatra: Temporary break for Amarnath Yatra
Amarnath Yatra: భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు. అయితే ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్రికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు మార్గాల్లో కూడా యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు.
జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 3,800 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా. యాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో భద్రతను పెంచారు. కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీటీ, పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీన ముగియనుంది.