మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
చివరగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ అంటూ సాలిడ్ యాక్షన్ మూవీతో వచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
మన ఎయిర్ ఫోర్స్‌ని ఇంకొక దేశంలోకి పంపించడమంటే ఇట్స్ ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్.. ఇలా ప్రతికారం తీర్చుకుంటూ పోతే.. దేశాలు ఉండవు బార్డర్స్ మాత్రమే ఉంటాయనే వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ స్టార్ట్ అయింది. ఇందులో వరుణ్ తేజ్ లుక్ అదిరిపోయింది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్‌ల కోసం ఆపరేషన్ వాలెంటైన్ మిషన్‌ను ఎలా సక్సెస్ చేశారనేదే కథ తెలుస్తోంది. అలాగే.. వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.
శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా.. అనే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. అలాగే.. ఏం జరిగిన సరే, చూసుకుందాం.. అంటూ టీజర్లో ఎండ్ షాట్స్ అదిరిపోయాయి. వందేమాతరం అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న రిలీజ్ చేయబోతున్నారు. మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.