»Congress Welcome To Ponguleti But He Demand 10 Seats
Ponguletiతో రాహుల్ టీమ్ భేటీ.. 10 సీట్లు కావాలట.. మధిరపై మాత్రం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని కోరగా.. 10 సీట్లు ఇస్తేనే వస్తా అని పొంగులేటి స్పష్టంచేసినట్టు తెలిసింది.
Congress welcome to ponguleti but he demand 10 seats
Ponguleti:ఖమ్మం జిల్లాలో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ (congress) భావిస్తోంది. ఆయనతో రాహుల్ గాంధీకి చెందిన సభ్యులు ఈ రోజు సుధీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలని కోరగా.. తన డిమాండ్‌ను వారి ముందు ఉంచినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యీ సీట్లు తనకు కావాలని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై చర్చలు జరిపిన బృందం.. ముందు పార్టీలో చేరాలని ఆ తర్వాతే సీట్ల గురించి చూద్దాం అని చెప్పినట్టు సమాచారం.
ఖమ్మం (kammam) జిల్లాలో మధిర తప్ప మిగతా 9 నియోజకవర్గాలు తన మనుషులకు ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) కోరారట. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) సిట్టింగ్ స్థానం.. ఆ సీటును మాత్రం ఆయనకు ఇవ్వాలని పొంగులేటి (ponguleti) అనుకున్నారు. మిగిలిన ఒక సీటును కంటోన్మెంట్ టికెట్ కావాలని కోరారని తెలిసింది. పార్టీలో చేరాలని.. తగిన గౌరవం ఇస్తామని.. టికెట్ల గురించి తర్వాత చర్చిద్దామని వారు చెప్పినట్టు తెలిసింది. వివిధ అంశాలపై 6 గంటలపాటు (6 hours) చర్చించారు. పార్టీలో చేరికకు సంబంధించి క్లారిటీ రాలేదు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti) వ్యాపార వేత్త. వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితుడై ఆ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ (kcr) మాత్రం పొంగులేటికి ఎలాంటి పదవీ ఇవ్వలేదు. మంత్రివర్గంలోకి కాదు కదా.. కనీసం నామినెటెడ్ పదవీ (nomanated post) కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. కాకరేపారు. ఇటీవల ఆయనతోపాటు జూపల్లి కృష్ణరావును (jupally krishna rao) కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బలమైన పొంగులేటిని (ponguleti) తమ పార్టీలో చేర్చుకోవాలని అన్నీ పార్టీలు చూస్తున్నాయి. ఈ రోజు పొంగులేటితో కాంగ్రెస్ ప్రతినిధులు చర్చలు జరిపారు.
గత ఎన్నికల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై (tummala nageshwar rao) పొంగులేటి (ponguleti) ఫోకస్ చేశారని ఖమ్మం రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తాయి. ఆయనను ఓడించడంలో కీ రోల్ పోషించారట. ఆ ఎన్నికల్లో ఒక్క పువ్వాడ అజయ్ కుమార్ (puvvada ajay kumar) మాత్రమే టీఆర్ఎస్ (trs) నుంచి గెలిచారు. అందుకే అతనికి మంత్రి పదవీ (minister post) లభించింది. ఇప్పుడు అజయ్‌పై (ajay) కూడా పొంగులేటి (ponguleti) దృష్టిసారించరని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అతనిని ఓడించడమే లక్ష్యం అని చెబుతున్నారట. సో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే ప్రయత్నాల్లో పొంగులేటి ఉన్నారు. ఏ పార్టీ తనకు హామీ ఇస్తే.. ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.