సౌత్ ఆప్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరు...
టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ రోజు ఉదయం కానుంది. టీడీపీ శ్రేణులు యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేశాయి. నిన్ననే లోకేశ్ కుప్పం గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఉదయం 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు 50 వేల మందికి పైగా టీడీపీ నేతలు వస్తారని చెబుతున్నారు. సభలో వేదిక...
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ రోజు(27 జనవరి) నుండి ప్రారంభం కానుంది. ఉదయం గం.11.03 నిమిషాలకు నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. 4000 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర 400 రోజులు సాగనుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం లోకేష్ కుప్పం వచ్చారు. ఆడపడుచులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బడ చేశారు. ఉదయం స్థానిక […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో హైడ్రామా జరిగింది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య వామపక్ష విద్యార్థి సంఘం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారు. లేడీస్ హాస్టల్‌లో ఈ డాక్యుమెంటరీని ప్లే చేశారు. అదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన రాయలసీమ పరిరక్షణ వేదిక చీఫ్ బైరెడ్డి రాజశఖరరెడ్డి మండిపడ్డారు. తనను జనసేనాని ముసలోడు అంటున్నారని, ఎలా అయితే కొండారెడ్డి బురుజు వద్ద తనతో కుస్తీకి సిద్ధమా అని సవాల్ చేశారు. సీమ ఉద్యమకారుల్ని పవన్ అవమానించారన్నారు. సీమ సెంటిమెంట్ ఆయనకు ఏం తెలుసన్నారు. సీమను రెండుగా చేయాలని చూస్తే, ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విభజన సమయంలో పవన్ సినిమాలు తీసుకుంటూ నోరు ఎత్తలేదని, ఇప...
కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య మీడియాకు దూరంగా మైసూరులో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లికి హాజరైన నటుడు ధనంజయ వారి పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హరిప్రియ ‘తకిట తకిట’ స...
తెలంగాణలో నేటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. గతంలో నిలిపి వేసిన 12 జిల్లాల్లో దంపతుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యా...
సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మం మీద దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మధ్య హిందూ దేవతల పైన మాట్లాడటం చూస్తూనే ఉన్నామని, ఇది అత్యంత దారుణమని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అయ్యప్ప స్వామిని, ఆ తర్వాత సరస్వతి మాతను దూషించిన అంశాలు చూశామని గుర్తు చేశారు. అలా దూషించే అందరికీ నేను చేతులు జోడించు చెబుతున్నానని, అలాంటి దూషణ కేవలం బ్రాహ్మణులే బాధపడతారు అనుకుంటే పొరపాటు అన్నారు. ప్...
గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( India: The Modi Question) దేశంలో వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్ లో నిషేధించిన డాక్యుమెంటరీని గణతంత్ర దినోత్సవం రోజు పలుచోట్ల వీక్షించారు. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన ఆయా చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని హెచ్ సీయూలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడంతో వర్సిటీలో అలజడి మొదలైంది. రెండు విద్యార్థి సంఘాల మధ...
మరికొన్ని గంటల్లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కుప్పం నుంచి జరగనుంది. గురువారం రాత్రి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు లోకేశ్ చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. మహిళలు హారతి ఇచ్చి దిష్టి తీశారు. గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ సీనియర్ నేతలు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం పాదయాత్ర తొలిరోజు.. కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభకు 50 వ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున పద్ధతిగా మాట్లాడతారు.. పవన్ అలా కాదన్నారు. సెలబ్రిటీ పార్టీ నేత మాత్రం సన్నాసి మాటలు మాట్లాడాడని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పిచ్చెక్కినట్టు మాట్లాడటంతో రియాక్ట్ కావాల్సి వస్తోందని తెలిపారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఓ సామెతను చెప్పా...
ప్రేమ కోసం ఎంతటి సాహసమైనా చేయాలని అనిపిస్తుంది. ఇక మనసుకు నచ్చిన వాళ్లు చెబితే ఎంతటి పనులనైనా చేయడానికి వెనుకాడం. ఇక అమ్మాయి కోరితే అరక్షణంలో తీసుకుని ఇచ్చే ప్రియులు కూడా ఉంటారు. అట్లాంటి వ్యక్తే మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు. ప్రేయసి కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ప్రేయసి కోరిందల్లా తీసుకొచ్చి ఇచ్చేందుకు బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో ఆమె కోరికలన్నీ తీ...
74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ భవనం జిగేల్ మంటోంది. సాయంత్రం కాగానే పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మొత్తాన్ని లైట్లతో ప్రకాశించేలా చేశారు. పార్లమెంట్ భవనం ముందు జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శించారు. కొన్ని నిమిషాల పాటు పార్లమెంట్ మొత్తం కళ్లు జిగేల్ మనేలా ప్రకాశించింది. పార్లమెంట్ భవనాల చుట్టూ లైట్స్ అమర్చ...
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీ అవార్డు వరించింది. ఎంఎం కీరవాణి, ఆ పాట రాసిన గీత రచయిత చంద్రబోస్‌ను గవర్నర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో...
గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని ఉధ్నా ప్రాంతంలో ఉన్న కార్ల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ మంటల్లో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న కొత్త కార్లన్నీ మంటలకు ఆహుతి అయిపోయాయి. భారీ అగ్ని ప్రమాదం వల్ల ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న లేచాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం ...