»Minister Ktr Inaugurated Various Development Works In Sirisilla District
Minister KTR : సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట (Rajannapet)గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని ప్రారంభించారు.
సిరిసిల్ల జిల్లా (Sirisilla District) లోపలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ (Minister KTR) శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆరే బలమని, పేద ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత ఆయనకే దక్కుతుందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట (Ellareddy Peta) మండలం దుమాల, రాజన్నపేట, దేవుని గుట్ట, బాకురుపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు. రాజన్నపేట (Rajannapet) గ్రామంలో రూ. 35లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవన ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో నిరంతరం శ్రమించి ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు కిస్టు నాయక్ తండాలో కొద్దిసేపు ఆగిన మంత్రి కేటీఆర్ (Minister KTR).. మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రాజన్నపేట గ్రామంలో రూ.33లక్షలతో మన ఊరు మనబడి కార్యక్రమం (Manabadi program) ద్వారా పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు మంత్రి వివరించారు. అభివృద్ధికి నోచుకోని రాజన్నపేటలో వెనుకబాటుతనం ఉందని గుర్తించి, స్వయంగా తానే దత్తత తీసుకుని అభివృద్ధి చేశానన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ నూతనంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం (Grilahakshmi Scheme) ద్వారా ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. రాజన్న గ్రామంలో రోడ్ల పక్కన అవసరమైన డైనేజీలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు 90 కుట్టు మిషన్లను వారం రోజుల్లోగా అందజేస్తామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్నపేట గ్రామంలో మరియు బాకూరుపల్లి తండాలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను మంత్రి @KTRBRS ప్రారంభించారు. pic.twitter.com/I21TCFctMg