Avinash reddyకి స్వల్ప ఊరట.. సీబీఐ విచారణ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
YS Avinash reddy:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (viveka) హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (Avinash reddy) స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హత్య కేసులో ఈ రోజు 10.30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అధికారులు (cbi officials) కోరిన సంగతి తెలిసిందే. ఆఫీసుకు బయల్దేరగా.. రేపు విచారణకు హాజరుకావాలని సీబీఐ అదనపు ఎస్పీ వాట్సాప్‌లో అవినాష్‌కు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన సీబీఐ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కోరడంతో ఈ రోజు వచ్చారు. రేపు రావాలని సమాచారం ఇవ్వడంతో వెనుదిరిగారు. మంగళవారం (రేపు) సాయంత్రం 4 గంటలకు విచారణకు పిలవాలని సీబీఐని జడ్జీ సురేందర్ ఆదేశించారు.
అంతకుముందు బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు జరిగాయి. ఈ నెల 30లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు (supreme court) ఆదేశించిందని, విచారణకు ఎప్పుడు పిలిచినా పిటిషన్లు వేస్తున్నారని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. బెయిల్‌పై (bail) హైకోర్టు నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు అవినాశ్ హాజరవుతారని ఆయన తరపు లాయర్లు చెప్పారు. ఇదిలా ఉంటే వైఎస్ వివేకానంద కూతురు సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
వివేకా హత్యకేసులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్ ముందు హాజరపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇటీవల అవినాశ్ రెడ్డి (avinash reddy) ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని (uday kumar reddy) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.