KTR: అంతా తూచ్.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం : కేటీఆర్
అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు మినహా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ కు పట్టం కడుతూ బీఆర్ఎస్కు షాకిస్తూ ఫలితాలను వెలువడిస్తున్నాయి.
KTR: అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు మినహా తెలంగాణలో పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ కు పట్టం కడుతూ బీఆర్ఎస్కు షాకిస్తూ ఫలితాలను వెలువడిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం..ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధం.. ఈసారి కూడా తమదే అధికారం అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయంటున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ గతంలో కూడా చూశాం. మాకున్న అంచనా ప్రకారం 70 పైగా స్థానాల్లో కచ్చితంగా మేమే గెలుస్తున్నాం. డిసెంబర్ 3న మీరే చూస్తారు, ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పు అని.. మీరే తెలుసుకుంటారు. ఇదే నేషనల్ మీడియా గతంలోనూ ఇలాంటి ఫలితాలే ఇచ్చింది. కానీ మేమే అధికారం చేపట్టాం. ఇవాళ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ తప్పని.. ఇవాళ ఇచ్చిన ఫలితాలు నిజం కాదని.. డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా?. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఫైనల్ పోలింగ్ శాతం అనేది రేపు ఉదయం వస్తుంది. ఆ తర్వత అనాలసిస్ చేయండి’ అంటూ కేటీఆర్ మాట్లాడారు.