»Exit Polls 2024 Today Take A Look At How Accurate Predictions
Exit Poll 2024 : ఈ సాయంత్రం విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్
ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. దీంతో ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Exit Poll 2024 today: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగియనున్నాయి. సుదీర్ఘంగా ఏడు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు నేటి సాయంత్రంతో ముగియనున్నాయి. దీంతో సాయంత్రం ఆరున్నర గంటల నుంచి వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్(Exit Polls) విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓటర్లపై ప్రభావం చూపించకుండా ఉండేందుకు ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్‌ని(Exit Polls) వెల్లడించకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు. ఇక ఈ సాయంత్రం ఎన్నికలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడవనున్నాయి. అయితే పలు సంస్థలు వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్ కూడా అంత ఆక్యురేట్‌గా ఉండటం లేదు. ఓటరు నాడిని పూర్తిగా ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు.
గతంలో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ని(Exit Polls) చూసుకున్నట్లైతే ఎగ్జిట్ పోల్స్ 1998, 2012, 1019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిజం అయ్యాయి. అలాగే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అదే నిజం అయ్యింది. మరి ఈ సాయంత్రం వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.