Gold Rates Today : వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ దిగి వచ్చాయి. రికార్డు హైలో నడుస్తున్న వీటి ధరలు దిగి రావడంతో కొనుగోలుదారుల్లో సంతోషం నెలకొంది. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold rate decreased by more than 3000 last 10 days india
Gold and Silver Rates Today : బంగారం కొనుక్కోవాలని చూస్తున్న వారికి శుభ వార్త. వరుసగా రెండో రోజూ పసిడి, వెండి ధరలు దిగి వచ్చాయి. ముందుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. శనివారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.179 తగ్గింది. దీంతో దీని ధర రూ.74,174కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల సైతం పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,174గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని మాత్రమే. ఆ తర్వాత దీనిలో కాస్త హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ ధరలకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి తోడవుతాయని గుర్తుంచుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) సైతం భారీగా తగ్గింది. శనివారం ఒక్కరోజే రూ.1,361 దిగి వచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.92,870కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ వెండి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. వెండి, బంగారం రెండూ నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ శనివారం 12 డాలర్లు తగ్గి 2328 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 30.41 డాలర్లుగా ఉంది.