»Dasara Mass Rampage Record Collections In Two Days
Chevi Reddy Bhaskar Reddy వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా సంచలన వ్యాఖ్యలు..
Bhaskar Reddy : ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చంద్రగిరి నియోజకవర్గం వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చంద్రగిరి నియోజకవర్గం వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆయన తన కుమారుడి కోసం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా మోహిత్ రెడ్డి కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాకుండా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పోటీ నుంచి తప్పుకుని పార్టీ ఎన్నికల కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించనున్నారు అని ప్రచారం జరుగుతోంది.
ఇక ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాజ్యసభకు పంపబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మోహిత్ రెడ్డికి టిక్కెట్ ఖరారు అయిన నేపథ్యంలో అభిమానుల సందడి చంద్రగిరిలో కనిపిస్తోంది.