దేశసార్వత్రిక ఎన్నికలు నిన్నటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. మరోసారి బీజేపీకే దేశ ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంపీగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
Kangana Ranaut: దేశంలో సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రం 6 గంటలతో ముగిశాయి. దాంతో దేశమంత ఎగ్జిట్ పోల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. మరోసారి దేశంలో బీజేపీ జెండా ఎగురుతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విజయం సాధిస్తుందనే వార్త వైరల్ అవుతుంది. కంగనా రనౌత్ ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి కంగనా పోటీ చేసింది. బీజేపీ తరఫున బరిలో దిగిన నటీ ఆరంభంమలోనే అదరగొడుతుందని, అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆమెకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య బరిలో ఉన్నారు. మండి నియోజకవర్గం చాలా కాలంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉందని ఈ సారి కంగనా విజయంతో బీజేపీ జెండా ఎగరనుందని తెలుస్తుంది.