The elections are over... the whole country is excited about the results
Loksabhaelections: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నేడు చివరి విడత ఎన్నికలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 తరువాత కూడా ఓటేయడానికి లైన్లో ఉన్నవారికి అవకాశం ఇచ్చారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒడిశా అసెంబ్లీలో 42 స్థానాలలో ఈ రోజు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న లెక్కింపు జరగనుంది. దీనిపై దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది.