SRPT: ఎన్నికల నేపథ్యంలో మోతే మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. రెచ్చగొట్టే లేదా చట్టానికి విరుద్ధమైన చర్యలు చేస్తే ఉపేక్షించబోమని, చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మోతే మండలం సిరికొండ గ్రామంలో ప్రజలకు ఎన్నికలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.