ఇండిగో (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ మొదట్లో 7 శాతం విలువ కోల్పోయాయి. ఉదయం 10 గంటల సమయానికి 4.08 శాతం నష్టంతో రూ.5,151 వద్ద షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు అభద్రతా భావంతో ఈ షేర్ల నుంచి పెట్టుబుడులు వెనక్కి తీసుకుంటున్నారు.