SRD: సిర్గాపూర్ మండలంలో 28 గ్రామపంచాయతీలో గాను 140 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకుని, నిరాశ చెందినవారు ఉక్రోషంతో నామినేషన్ వేశారు. వారిని విత్ డ్రా చేయించేందుకు నాయకులు, కార్యకర్తలు బుజ్జగింపులు చేస్తున్నారు. కొన్నిచోట్ల కొలిక్కి వస్తున్నప్పటికీ, మరి కొన్నిచోట్ల అభ్యర్థులు మొండి వైఖరితో ససేమిరా అంటున్నారు.