ATP: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్పీ జగదీష్ నేతృత్వంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 128 పిటిషన్లను ఎస్పీ స్వీకరించారు. ప్రజలు భయపడకుండా తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని, చట్ట పరిధిలో పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.