SKLM: ఒడిస్సా నుంచి కేరళకు ఆక్రమంగా తరలిస్తున్న రూ.5,000 విలువైన గంజాయిని కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపారు. అనంతరం నిందితుడిని స్థానిక ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత సమక్షంలో హాజరుపరిచినట్లు చెప్పారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.