కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ ఆదివారం తెలిపారు. నవంబర్ నెలలో 23.5 కిలోల గంజాయి, 1620 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేశారు. ఎంవీ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై 6527 కేసులు నమోదు చేసి రూ.16.16 లక్షల జరిమానా విధించారు. గంజాయి, బెట్టింగ్ వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.