Exit polls కళ్ల ముందే ఉంటాయి.. ఆగం కావొద్దు: సీఎం కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ చూడాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వరసగా మూడోసారి గెలిచి, అధికారం చేపట్టబోతున్నామని తనను కలిసిన నేతలకు స్పష్టంచేశారు.
Exit polls: ఆగం కావొద్దు.. పరేషాన్ అవ్వొద్దు.. ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం అని తనను కలిసిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చెప్పారు. ఎగ్జిట్ పోల్ (Exit polls) ఫలితాలు చూసి.. ఆగం కావొద్దన్నారు. దాని రిజల్ట్ మన కళ్లు ముందే ఉంటాయని చెప్పారు. రెండు రోజులు ఆగండి అని తనను కలిసిన నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎగ్జిట్ పోల్ కన్నా (Exit polls).. ఎగ్జాక్ట్ పోల్స్ కళ్ల ముందు ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
మూడో తేదీ సంబరాలు చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో ప్రగతి భవన్ నుంచి వెళ్లే నేతలు విక్టరీ సింబల్ చూపించి కదిలారు. రాష్ట్రంలో హ్యాట్రాక్ కొడతామని ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ భరోసా కల్పించారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నాం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో కూడా మంత్రులకు సమాచారం ఇచ్చింది. ప్రజలు పార్టీకి ఓటేశారని.. నేతలు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ (Exit polls) మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఓటమిని అప్పుడే అంగీకరించడం లేదు.