Janhvi Kapoor:అందాల తార శ్రీదేవి (sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మరో ఆఫర్ కొట్టేసింది. టాలీవుడ్లో తారక్ (ntr), కొరటాల శివ (koratala shiva) మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాం చరణ్ (Ram charan), బుచ్చిబాబు (buchibabu) సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ వరసగా సినిమాలు చేస్తోంది.
తారక్ (ntr), జాన్వీ (Janhvi Kapoor) మూవీ సెట్స్‌పై ఉండగా.. మరో సినిమాకు ఓకే చెప్పిందట. ఉప్పెన మూవీ తెరకెక్కించిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చెర్రీ సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్ కోసం జాన్వీ కపూర్‌ను (Janhvi Kapoor) సంప్రదించగా.. అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ (NTR), చరణ్‌తో (CHARAN) నటించే అవకాశం ఆమె సొంతం చేసుకున్నట్టైంది.
చెర్రీ సినిమా కబడ్డీ (kabaddi) బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందట. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బుచ్చిబాబు (buchibabu) బిజీగా ఉన్నాడు. మూవీలో చరణ్ డ్యుయల్ రోల్ పోషిస్తారని తెలిసింది. ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా.. ఒకరు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాగా.. మరొకరు మృణాల్ ఠాకూర్ అని తెలుస్తోంది.
తెలుగులో వరస సినిమాలతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బిజీ అవనుంది. తల్లి శ్రీదేవి (sri devi) లాగే.. తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటోంది. అందుకోసమే.. ఆచి తూచి మరీ పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారని తెలిసింది.