»Lara Dutta Suriya React As R Madhavans Son Vedaant Bags 5 Gold Medals
Madhavan: తనయుడికి 5 గోల్డ్ మెడల్స్: సూర్య, ఖుష్బూ, లారా దత్తా ప్రశంసలు
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
సినీ నటుడు ఆర్ మాధవన్ (cine actor r madhavan) నేడు గర్వించదగిన తండ్రి అయ్యాడు. కుమారుడు వేదాంత్ మాధవన్ (vedaant madhavan) స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో (swimming championship) భారతదేశానికి 5 బంగారు పతకాలు సాధించాడు (gold medals). సోషల్ మీడియా వేదికగా ఈవెంట్ లో తన కొడుకుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో పాటు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాధవన్ కుమారుడు వేదాంత్ 58వ MILO/MAS మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో (swimming championship) పాల్గొన్నాడు. ఆ ఫొటోల్లో యువకుడు భారత జెండాతో పాటు పతకాలతో పోజులిచ్చాడు. మాధవన్ భార్య సరితా బిర్జే ఒక ఫోటోలో వేదాంత్‌తో కలిసి ఉన్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. దేవుని దయ, మీ అందరి శుభాకాంక్షలతో వేదాంత్ ఈ వారాంతంలో కౌలాలంపూర్ లో జరిగిన 2023 మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌లలో 2 PBలతో భారతదేశానికి 5 స్వర్ణాలను (50 మీ, 100 మీ, 200 మీ, 400 మీ మరియు 1500 మీ) అందుకున్నాడు. ఎంతో సంతోషంగా ఉంది.. అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు. ఇది అద్భుతం. (రెడ్ హార్ట్ ఎమోజి). వేదాంత్, సరిత, మీకు, బృందానికి హృదయపూర్వక అభినందనలు అంటూ నటుడు సూర్య పేర్కొన్నారు.
“అభినందనలు మ్యాడీ (ఆర్ మాధవన్)… వేదాంత్ కు ఆత్మీయ ప్రేమను అందిస్తున్నాను (హృదయం మరియు చప్పట్లు కొడుతున్న ఎమోజీలు) అని ఖుష్బూ పేర్కొన్నారు. ‘రాక్ ఇట్ వేదాంత్. మీకు, గర్వించదగిన తల్లిదండ్రులకు అభినందనలు! మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నానని రాశారు. “అద్భుతం!!!! అభినందనలు!!!” అంటూ లారా దత్త పేర్కొన్నారు.
వేదాంత్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో పెద్ద విజయం సాధించడం ఇదే మొదటిసారి కాదు. అతను గత కొన్ని సంవత్సరాలుగా అనేక పతకాలు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అతను ఖేలో ఇండియా 2023 టోర్నమెంట్లో టీమ్ మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు బంగారు, రెండు రజత పతకాలను సాధించాడు. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించాడు.