కోనసీమ: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలన్నారు.