సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పెనుకొండలో అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన బస్టాండ్‌ను మంత్రి ప్రారంభిస్తారు. 3:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.