AKP: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఇవాళ దర్శించుకున్నారు. స్పీకర్ సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్-సువర్ణ దంపతులు, నర్సీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్-దివ్యశ్రీ దంపతులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.