భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి జోరు కొనసాగుతోంది. తాజా నివేదికల ప్రకారం, మే నెలలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే మే నెలతో పోల్చి చూస్తే ఈసారి ట్యాక్స్ కలెక్షన్లలో 3.2 శాతం స్పష్టమైన వృద్ధి కనిపించింది. దేశీయంగా వ్యాపార లావాదేవీలు, కొనుగోళ్లు పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.