NRML: నిర్మల్ పట్టణంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులు సోమవారం బ్లాక్ స్పాట్ సర్వే చేపట్టారు. ప్రమాదాలకు కారణమవుతున్న కూడళ్లు, మలుపులు, రద్దీ ప్రాంతాలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారి భద్రత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.