కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా, మెప్మా, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్స్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను చూసి వారిని అభినందించారు.