AP: శ్రీరామ భక్తులపై దాడిచేసిన వారిని వదిలేది లేదని BJP నేత భానుప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 55 మంది మారణాయుధాలతో విధ్వంసం సృష్టించారని తెలిపారు. ఆకివీడును మరో అయోధ్య చేయకండని.. అక్కడ రామాలయాన్ని పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. నిధులు ఇవ్వాలని TTDని కోరుతామన్నారు. ఆకివీడు రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగిన విషయం తెలిసిందే.