బెల్లంకొండ గణేష్ తన తదుపరి మూవీని దర్శకుడు కరుణాకరన్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ‘స్వాతిముత్యం’, ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాల తర్వాత గణేష్ నటించబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఇది. కరుణాకరన్ చెప్పిన కథ నచ్చడంతో గణేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ సినిమాను 2026 ఏప్రిల్ 13న అధికారికంగా ప్రారంభించనున్నారట. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.