AP: అసెంబ్లీలో CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని పవన్ అన్నారు. సైబరాబాద్ సృష్టించినట్లు అమరావతిని కూడా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన మద్దుతుతో 2014, 2024లో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామని.. అందుకు పవన్ చేసిన కృషిని చంద్రబాబు కొనియాడారు.