TPT: విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా వారి కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్‌లు కూడా అదే ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు చొప్పున విరాళంగా సమర్పించారు.