NLG: నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన BPL 5వ సీజన్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఫైనల్లో నెర్మట జట్టు విజేతగా నిలవగా, బంగారిగడ్డ జట్టు రన్నరప్, చండూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ముఖ్య అతిథులుగా MLC నెల్లికంటి సత్యం, మున్సిపల్ ఛైర్మన్ డా. కోడి శ్రీనివాసులు పాల్గొని బహుమతులు అందజేశారు.