KMR: రాజంపేటలో యూరియా సరఫరాపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాప్లో ప్రతిరోజూ జీరో స్టాక్ మాత్రమే కనిపిస్తోందని రైతులు అధికారులను ప్రశ్నించగా.. ముందుగా అప్లై చేసుకున్నారని అధికారులు సమాధానం చెబుతున్నారు. యాప్ ద్వారా ముందుగానే అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు. యూరియా సాధారణ రైతులకు కాకుండా కొంతమంది నాయకులకు మాత్రమే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.