AP: కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ‘తిరుమలను ప్రక్షాళన చేస్తామనేవి మాయమాటలు మాత్రమే. కొండపై బ్రోకర్లు ఉన్నారు. రూ.15 వేలు ఇస్తే టికెట్లను బ్రోకర్లు అమ్మేస్తున్నారు. 400-600 టికెట్లు అమ్మేస్తున్నారు. రోజుకు శ్రీవాణి టికెట్ల ముసుగులో 15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు.