TG: సైబర్ నేరగాళ్లు తాజాగా వాటర్ బిల్లుల పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ‘మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం’ అంటూ వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. HMWSSB WATER BILL UPDATE.apk అనే లింక్‌ను పంపిస్తున్నారని.. దానిపై క్లిక్ చేయొద్దని హెచ్చరించారు.