TG: సింగర్ మంగ్లీపై కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగ్లీ తమ్ముడు శివ, మరికొందరు పెట్టుబడుల పేరుతో.. వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేసి పరారయ్యారని అడ్వొకేట్ సుబ్బారావు తెలిపారు. ఈ మోసంలో మంగ్లీ హస్తం కూడా ఉందన్నారు. కొంతమంది బాధితులు మంగ్లీకే నేరుగా డబ్బులు ఇచ్చారన్నారు. మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారన్నారు.