TG: రాష్ట్రంలో బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో అయితే పరిస్థితి ఘోరంగా మారిపోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతోందని.. కుటుంబాల్లో సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మామూళ్లకు అలవాటుపడి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.