TG: HYDలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి.. నీళ్లు కలుషితమవుతున్నాయంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జలమండలిని కోర్టు ప్రశ్నించింది. జంట జలాశయాల నిర్వహణపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.