TG: మాజీమంత్రి కేటీఆర్ ఇవాళ నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కుమ్మెర జాతరలో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో, కేటీఆర్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.