AP: రాజధాని అంటే కేవలం భవనాలు కాదు.. అది గౌరవానికి ప్రతీక అని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లును.. పార్లమెంట్లో పెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ.. గతంలో బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.