TG: CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ను ఓడిస్తామనడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న హైకమాండ్ నిబంధనల వల్లే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారే తప్ప.. జీవన్ రెడ్డికి అన్యాయం చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదన్నారు.