TG: హైదరాబాద్లో ఇవాళ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడ జరిగే అధికారిక వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నగరవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేసింది.