AP: ప్రముఖ క్షేత్రం శ్రీశైలంలో భారీ స్థాయిలో మద్యం సీసాలు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. RTC బస్టాండ్, సిద్దరామప్ప కాంప్లెక్స్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురు మహిళా నిందితుల నుంచి 314 క్వాటర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసార సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలంకు మద్యం తరలించి హోటళ్లలో పనిచేసే కార్మికులకు అమ్ముతున్నట్లు గుర్తించారు.