AP: రాష్ట్ర రాజధాని అమరావతిని రాజకీయ వివాదంగా మార్చొద్దని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. రాజకీయంగా వేర్వేరు అభిప్రాయాలు ఉండటం సహజమే కానీ రాజధాని విషయంలో ఇది తగదని పేర్కొన్నారు. 2014-19 కాలంలో రాజధానిగా అమరావతికి YCP మద్దతు తెలిపిందని గుర్తు చేసిన ఆయన.. ఇప్పటికే సమీకరించిన భూముల్లోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.