BDK: భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,51,790 మంది స్వామివారిని దర్శించుకోగా 2025-26లో ఆ సంఖ్య 26,75,580కి చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,23,790 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని ఆలయ అధికారులు తెలిపారు.