అన్నమయ్య: జిల్లాలో నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ స్మార్ట్ పోలీసింగ్ అమలు చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.