ATP: అమరావతి బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం కలిశారు. ఈ భేటీలో అమరావతి అభివృద్ధి, జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్రం నుంచి జిల్లాకు అందాల్సిన సహకారంపై లోకేష్‌కు ఎంపీ వివరించారు.