TG: ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్, సంక్రాంతికి విడుదలైన రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీనారీ నడుమ మురారి సినిమాలు పైరసీ చేశారని తెలుగు ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 5 మూవీరుల్జ్, 1 సినీవుడ్, 1 తమిళ్ ఎంవీ వెబ్సైట్లను నిందితులుగా చేరుస్తూ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.